కార్వేటినగరం సింగిల్ విండో’ సీఈఓపై సస్పెన్షన్ వేటు

కార్వేటినగరం అక్టోబర్ 1 గరుడధాత్రి : కార్వేటినగరం సింగిల్ విండోలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి సీఈఓ దుష్యంత్ రెడ్డిపై చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది. చిత్తూరులో బుధవారం డీసీసీబీ చైర్మన్ అమరరాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన డిస్ట్రిక్ లెవెల్ ఎంపవర్డ్ కమిటీ మీటింగ్ జరిగింది. చైర్మన్‌తో పాటు డీసీఓ లక్ష్మి, బ్యాంకు సీఈఓ శంకర్బాబు, సభ్యులు పాల్గొన్నారు. కార్వేటినగరం విండో సీఈఓ దుష్యంత్ రెడ్డిపై జూన్-జూలై నెలలో అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు రావడంతో అప్పట్లో డీసీసీబీ విచారణకు ఆదేశించగా, నివేదిక వచ్చింది. రైతులకు...