కార్వేటి నగరం అక్టోబర్ 8 ( గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం మండలం సిడి కండ్రిగ గ్రామానికి చెందిన నల్ల కుక్కల సుబ్రహ్మణ్యం యాదవ్ ను మండల ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కార్వేటినగరం మండలంలో ఉన్న యాదవ కులస్తుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.