కావమ్మ తిరునాళ్లకు పోలీసు బందోబస్తు కల్పించాలి
గరుడధాత్రి న్యూస్ : నాగలాపురం రెడ్డి వీధిలోని శ్రీ కావమ్మ సమేత మారయ్య దేవాలయంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న తిరునాళ్ల సందర్భంగా ఆలయ నిర్వాహకులు సోమవారం ఉదయం నాగలాపురం ఎస్ఐ సునీల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా 29వ తేదీన శ్రీ కావమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమం జరగనున్నదని, ఊరేగింపు సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా నిర్వాహకులు కోరారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసుల సహకారం అవసరమని తెలిపారు.