కిశోరీ వికాసం, IVRS కాల్స్‌పై అవగాహన కార్యక్రమం
పిచ్చాటూరు, జూన్ 5 గరుడధాత్రి : పిచ్చాటూరు మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు, సూపర్‌వైజర్లు బాజవతి, సుమతి ఆధ్వర్యంలో పిచ్చాటూరు హెచ్‌డబ్ల్యూ అంగన్వాడీ కేంద్రంలో కిశోరీ వికాసం కార్యక్రమం మరియు IVRS కాల్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కిశోరీ వికాసం సెషన్-11లో భాగంగా పొగాకు, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, యువత వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్ర పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న...