GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 5:17 pm Digital Edition : GURU SWAMY

కుక్కలను అరికట్టండి గ్రామ సభలో పలువురు మొర

కార్వేటినగరం అక్టోబర్ 2 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం గ్రామ పంచాయతీ లో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ శుక్రవారం నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చించి, ప్రజలనుంచి వినతలను స్వీకరించి గ్రామ సభలో చర్చించడం జరిగింది. పలువురు ప్రజలు బౌండ్ వీధి చిన్న నగరి వీధిలో దోమలు అధికంగా ఉందని వాటిని అరికట్టాలని కలవరు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా పలు వీధుల్లో కుక్కలు అధికంగా ఉందని నివారించడానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామసభ కు ప్రత్యేక అధికారి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాధిక సింగిరెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది. మరియు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ మరియు గ్రామ స్థాయి అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది ఎంపిడిఓ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, సిబ్బంది గ్రామ ప్రజలుపాల్గొన్నారు.