కుక్ కమ్ హెల్పర్స్‌కు ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌పై శిక్షణ

పిచ్చాటూరు, జూన్ 8 గరుడధాత్రి : టాటా ట్రస్ట్స్ సహకారంతో విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలంలోని ఎంఆర్సీ (MRC) భవనంలో కుక్ కమ్ హెల్పర్స్‌కు బలవర్ధక ఆహారం (ఫోర్టిఫైడ్ ఫుడ్స్)పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోషకాహారం ప్రాముఖ్యత, ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాల వినియోగం, వాటి ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన వంటకాలను తయారుచేసే విధానాలను వివరించారు. అలాగే ఫోర్టిఫైడ్ బియ్యం, ధాన్యాలు,...