కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

తిరుపతి/చిత్తూరు, అక్టోబర్ 1 గరుడధాత్రి న్యూస్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానం, కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కుటుంబ సమేతంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్న మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక...