* సూపర్ సిక్స్ పథకాలను అందుకుంటున్న లబ్దిదారులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి.
* తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సహా వివిధ పథకాల ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాలపై లబ్దిదారులతో మాట్లాడిన సీఎం.
* పథకాల ద్వారా వారికి ఆర్ధిక వెసులుబాటు కుటుంబ సాధికారిత గురించి వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
* కుప్పంలోని కొందరు యువ ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో మాట్లాడిన సీఎం.
* సంజీవని సేవలు అందుకున్న వారితో మాట్లాడి పథకం అమలుపై ఆరా తీసిన సీఎం.
* కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై స్థానికులతో సీఎం ముఖాముఖి.
* రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్, స్ట్రీట్ లైటింగ్ చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.
* జల్ జీవన్ మిషన్ పనుల కోసం కొత్త రోడ్లు వేసే ముందుగానే పైప్ లైన్లు వేయాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.
* జీరో పావర్టీ కార్యక్రమంలో భాగంగా పీ4 అమలు తీరుపైనా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి.
కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస: ప్రతీ పేద కుటుంబానికీ అండగా నిలవాలన్న లక్ష్యంతోనే సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మొదటి రోజు సోమవారం ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
భూసారం, భూమిలో తేమ శాతాన్ని పెంచేందుకు బయోచార్ లాంటి విధానాలను అనుసరించాలన్నారు.
వ్యవసాయ వ్యర్ధాలను భూసారాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీబీజీ రామ్ జీ పథకం ద్వారా పశువుల దాణాకు కొరత లేకుండా చూస్తామన్నారు.ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పీఎండీఎస్ విధానం ద్వారా సాగు ప్రక్రియను చేపట్టాలి.కుప్పంలో ఫ్లోరీ కల్చర్ ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులు స్పూర్తిగా నిలుస్తున్నారు.సాగు వ్యయం తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు చేపడతాం.
మహిళా సాధికారిత విషయంలోనూ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
ఇంటికో వ్యాపారవేత్తగా మహిళలు తయారయ్యేందుకు అవసరమైన చేయూతను అందిస్తాం.యువత నైపుణ్యాలు సాధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి.పర్యాటకంగా కుప్పాన్ని మంచి టూరిజం డెస్టినేషన్ గా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు.రాక్ క్లైంబింగ్, బైకింగ్ లాంటి సాహస క్రీడలను ప్రోత్సహించాలి.
పేద కుటుంబాల్లో వెలుగులు నింపేలా మార్గదర్శులు శాశ్వతమైన కార్యక్రమాలను చేపట్టాలి.బంగారు కుటుంబాల్లో వారి సామర్ధ్యాలకు అనుగుణంగా చేయూత అందించాలి.2026 డిసెంబరులోగా కుప్పంలోని 8904 బంగారు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేలా చర్యలు.
కుప్పంలో పైలట్ గా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు దేశానికే మోడల్ గా మారుతోంది.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తాం.డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నాం.
2028 నాటికి కార్బన్ న్యూట్రల్ గా కుప్పం నియోజకవర్గం తయారు కావాలి. ఇంధనం, నీరు, వ్యర్ధాలపై దృష్టి పెట్టి సుస్థిరమైన విధానాలను అనుసరించాలి. నెట్ జీరో కుప్పంగా తయారు చేసేందుకు వ్యర్ధాలను సంపదగా మార్చాలి.
ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా ప్రతీ ఇంటిపైనా సౌర విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవాలి.వ్యర్ధాలను కాంపోస్టుగా తయారు చేసి సేద్యానికి వినియోగించేలా చూడాలి.పడిన వర్షాన్ని ఒడిసి పట్టి భూగర్భజలాలుగా మార్చేందుకు చెక్ డ్యాంలు, ఇతర నిర్మాణాలు చేప్టటాలి.
75-80 శాతం పచ్చదనం కుప్పంలో ఉండేలా ప్రణాళికలు చేపట్టాలి.స్వచ్ఛమైన కుప్పం ఆరోగ్యవంతమైన కుప్పంగా తయారవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.