GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 10:38 pm Digital Edition : GURU SWAMY

కుప్పంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన

కుప్పం, ఆగస్టు 04 (గరుడ ధాత్రి న్యూస్):

కుప్పం నియోజకవర్గంలో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి గాను పలు ప్రదేశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు . మంగళవారం కుప్పం నియోజకవర్గంలోని పెద్దబంగారు
నత్తం, బేవనపల్లి రెవెన్యూ విలేజ్ పరిసర ప్రాంతాల్లో ఇస్కాన్ నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా పీడీ కడా వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్. చైర్మన్ పి.ఎస్ మునిరత్నం, ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను సందర్శించి, ఆలయ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, భూమి విస్తీర్ణం, చేరుకునే మార్గాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్, ఇస్కాన్ టెంపుల్ వారు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను నిబంధనల మేరకు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.