కుప్పంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ కుప్పం,ఆగస్టు 02 (గరుడ ధాత్రి న్యూస్): నియోజకవర్గ కేంద్రమైన కుప్పంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన వివరాలు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ వేదిక జరుగుతుందన్నారు. కుప్పంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతుందని వివరించారు. కుప్పం అర్బన్, కుప్పం రూరల్, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని...