కుప్పంలో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

* శ్రీ కృష్ణార్జున దేవాలయంలో ప్రత్యేక పూజలు. * ఇండియన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. * సంతాన గోపాలకృష్ణ స్వామికి ప్రత్యేక పూజలు. కుప్పం,సెప్టెంబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం పట్టణంలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సంతాన గోపాలకృష్ణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం అర్చన పూజలు నిర్వహించారు. వేద పండితులు సోమశేఖర శాస్త్రి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి....