GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 4:48 am Digital Edition : GURU SWAMY

కుప్పం ప్రగతిని వివరిద్దాం- స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషి చేద్దాం

* టిడిపి నేతలు వెంకటేష్, రాజ్ కుమార్, డాక్టర్ వి. వెంకటేష్, సత్యేంద్ర శేఖర్.
* పరమ సముద్రంలో టిడిపి సమన్వయ సమావేశం.
కుప్పం,సెప్టెంబర్ 12 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కుప్పంలో జరుగుతున్న అభివృద్ధిని ఇంటింటా వివరిద్దామని స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషి చేద్దామని టిడిపి నాయకులు పిలుపునిచ్చారు. కుప్పం అర్బన్ పరిధిలోని పరమ సముద్రంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులు రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ డాక్టర్ వి. వెంకటేష్, అర్బన్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్, కుప్పం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్. సత్యేంద్ర శేఖర్ లు ప్రసంగించారు. త్వరలో స్థానిక ఎన్నికలు రానున్నాయని అన్నారు.ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కుప్పం నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎక్కడ విభేదాలు లేకుండా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్ బాబు, మురుగేష్, నబి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.