GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 5:41 am Digital Edition : GURU SWAMY

కుప్పం సమగ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం

* 18 కుటుంబాలు వైసీపీ నుంచి టిడిపిలో చేరిక.
* టిడిపి ఇన్చార్జ్ మునిరత్నం, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఉడా చైర్మన్ సురేష్ బాబు, టిడిపి అధ్యక్షులు రాజగోపాల్.
కుప్పం,సెప్టెంబర్ 19 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని టిడిపి నాయకులు పేర్కొన్నారు. శనివారం కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్.మునిరత్నం, ప్రభుత్వ విప్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్,ఉడా చైర్మన్ సురేష్ బాబు, కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ మాట్లాడారు. గత రెండేళ్లుగా పంచాయతీ పరిధిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలకు వివరించడం జరిగింది.కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు సూచించడం జరిగింది.
ఈ సందర్భంగా వైసీపీకి చెందిన 18 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీ లోకి ఆహ్వానించడం జరిగింది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పి.సి. సాంబశివం, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణి, కుప్పం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివకుమార్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సలహా మండలి సభ్యులు రామచంద్ర, కుప్పం తెలుగుదేశం పార్టీ అర్బన్ 11 క్లస్టర్ ఇంచార్జ్ కె.కన్నన్, పెద్ద ఎత్తున పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.