కుప్పం సెగ్మెంట్లో రాజుకున్న స్థానిక ఎన్నికల వేడి

* వ్యూహాలకు పదును పెడుతున్న రాజకీయ పార్టీలు. * మొదలైన రాజకీయ పార్టీల సమావేశాలు. * సమావేశాల్లో గెలుపు గుర్రాలను పసిగడుతున్న నేతలు. కుప్పం,సెప్టెంబర్ 15 (గరుడ ధాత్రి న్యూస్): రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల వేడి రాచుకుంది. కుప్పం నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గానికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరో రెండు నెలల లోపు స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం...