కుప్పం సెగ్మెంట్లో విజయవంతంగా ఇంటింటికి తెలుగుదేశం
* 97.40 శాతం పూర్తి చేసిన యంత్రాంగం. * కార్యక్రమం కొనసాగింపు తీరుపై చంద్రబాబు ఆరా. * కార్యక్రమం కొనసాగిన తీరుపై చంద్రబాబుకు నివేదిక . కుప్పం,సెప్టెంబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ యంత్రాంగం విజయవంతంగా కొనసాగించింది. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల...