GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:16 pm Digital Edition : GURU SWAMY

కుప్పం 19వ వార్డులో రోడ్డు అక్రమణ తొలగించాలి

ప్రజా వేదికలో కౌన్సిలర్ల వినతి

కుప్పం,ఆగస్టు 03 (గరుడ ధాత్రి న్యూస్)

కుప్పం పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో రోడ్డు ఆక్రమణ తొలగించాలని కోరుతూ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ కు కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. సోమవారం కుప్పంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ సందర్భంగా పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ దామోదరం నాయుడు, మరియు జాకీర్ లు కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. 19వ వార్డులో గల రైల్వే స్టేషన్ రోడ్డు, యాక్సిస్ బ్యాంక్ ప్రక్క నుండి కుప్పం జమీందార్ ప్యాలెస్ కు పోవు దారి గవర్నమెంట్ రికార్డు కూడా ఉన్నదన్నారు.గతంలో ప్రతిరోజూ ఇదే దారిని దాదాపు 100 కుటుంబాలు రాకపోకలకు ఉపయోగించేవారన్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జరిగే తిరుపతి గంగమ్మ శిరస్సు కూడా జమీందారీ ఇంటికి ఇలాగే వచ్చేదని,ప్రస్తుతం కొంతకాలంగా ఈ దారి ఆక్రమణకు గురి కావడంతో అక్కడున్న ప్రజలు స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. చిన్నపిల్లలు పాఠశాల కు మరియు వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ రోడ్డు బాగుపడితే 19వ వార్డు ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు.