కుళ్లిన మాంసం విక్రయాలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి

-ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిని ఉపేక్షించరాదు. -సిపిఎం నగర కార్యదర్శి కె. వేణుగోపాల్. తిరుపతి నగరంలోని పి.పి. చావడి మటన్ మార్కెట్‌లో భారీ మొత్తంలో నిల్వ ఉంచిన కుళ్లిన మేక, గొర్రె తలలు, కాళ్లు మరియు ఇతర మాంసాహార పదార్థాలను ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని సిపిఎం నగర కార్యదర్శి కె. వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇలాంటి ఘటనలు...