కూటమిలో జనసేనకు గుర్తింపు లేనట్లేనా ..?

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న అసంతృప్తి చర్చ సత్యవేడు జూలై 06 గరుడధాత్రి : కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తెరపైకి వచ్చింది. కీలక కమిటీలు, నామినేటెడ్ పదవులు, స్థానిక స్థాయి నియామకాల విషయంలో జనసేనకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం లభించడం లేదన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేటలో జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మండల అధ్యక్షుడి...