GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:54 am Digital Edition : GURU SWAMY

కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం పనిచేస్తాం

కార్వేటినగరం అక్టోబర్ 28 గరుడదాద్రి న్యూస్
, కార్వేటినగరం మండలంలోని ఎల్.ఆర్. పేట గ్రామ పంచాయతీ
పరిధిలోని వెంకటాద్రిపురం గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి కె. బాలాజీ రెడ్డి, కూటమి ఎంపీపీ అభ్యర్థి వి. నిధి పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో, ప్రతి వార్డులో 90 శాతం పోలింగ్ నమోదయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కూటమి అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి, ఓటర్లను చైతన్యపరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు నాగేశ్వరరాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చంగల్ రాయులు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి రాజా, రాజేందర్ రెడ్డి, రవి యాదవ్, బీగాల రమేష్‌తో పాటు జనసేన పార్టీ నాయకులు రాఘవ, అన్నామలై, సురేష్ రెడ్డి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.