GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 1:04 am Digital Edition : GURU SWAMY

కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట

*తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు మరింత మెరుగైన సేవలు*

*తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి*

పలమనేరు, ఆగస్టు 11 ( గరుడ ధాత్రి ) :
కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వైద్య రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తోందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పాల్గొని వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తల్లులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు అవసరమైన సమయంలో రవాణా సదుపాయం కల్పించేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పలమనేరు నియోజకవర్గానికి ఇప్పటికే మూడు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, భవిష్యత్‌లో అవసరాలకు అనుగుణంగా మరిన్ని వాహనాలు తీసుకురావడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు, ఆధునిక వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అమరనాథ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ సకాలంలో వైద్యం అందేలా అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమానికి ముందు ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్యులు, సిబ్బంది ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వైద్య సేవలు, ఆసుపత్రిలోని వసతులపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కమిటీ డైరెక్టర్ రంగనాథ్, పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, ఆసుపత్రి సుపెండెంట్ మమతారాణి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు నాగరాజు,సుధాకర్, వీ.కోట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ధీరజ్, నాయకులు రాంబాబు,కుట్టి, గిరిబాబు, కృష్ణమూర్తి గౌడ్, శ్రీధర్, మదన్, డిష్ రమేష్, సుదర్శన్ బాలాజీ, రమేష్, గణేష్, మేదర వెంకటరమణ జనసేన నాయకులు హరీష్, చైతూ తదితరులున్నారు.