కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట
*తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు మరింత మెరుగైన సేవలు* *తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి* పలమనేరు, ఆగస్టు 11 ( గరుడ ధాత్రి ) : కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వైద్య రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తోందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి...