GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:37 pm Digital Edition : GURU SWAMY

కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం… ఇందిరా నగర్ లో డోర్ టూ డోర్ టీడీపీ

తిరుపతి, ఆగష్టు 3 :

తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని పలువురు లబ్ధిదారులు తెలిపారు. టిడిపి తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి జె డబ్ల్యూ విజయ్ కుమార్ నేతృత్వంలో సోమవారం 24 వ డివిజన్ ఇందిరానగర్ బండ్లమిట్టలో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది. జె డబ్ల్యూ విజయ్ కుమార్ నేతృత్వంలో పార్టీ నేతలు ఇందిరానగర్ బండ్ల మిట్టలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు లబ్ధి పొందిన వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ లకు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. అనంతరం మీడియాతో జె డబ్ల్యూ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం మరో మూడేళ్లలో దేశం లోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందబోతోందని తెలిపారు. తిరుపతి నియోజకవర్గం ఇప్పటికే అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు తిరుపతి తో ఎంతో విడదీరాని బంధం ఉందని, భవిష్యత్తులో పారిశ్రామికంగా విద్యాపరంగా వైద్య పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు వికలాంగ పెన్షన్లు
అందజేస్తున్నామన్నారు. 24వ డివిజన్లో ప్రజలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు తాము ముందు ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.
24 డివిజన్ టిడిపి నేతలు జె. దిలీప్,మల్లెపూల సుబ్రహ్మణ్యం, చంద్రబాబు, ఏ గంగాధర్ ధనలక్ష్మి కేకే చెల్లప్ప జలకం రాజేష్, బద్రి గోనె రవి శంకర్, మంజునాధ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.