GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 6:55 am Digital Edition : GURU SWAMY

కూటమి ప్రభుత్వ పాలనలోనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమం ఫలాలు

కార్వేటినగరం ఆగస్టు 17(గరుడ దాత్రి న్యూస్)

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందుతున్నాయని మండలం టీడీపీ అధ్యక్షులు చెంగల్రా యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా అన్నారు.
“రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’* ఇంటింటి కార్యక్రమంలో భాగంగా సోమవారం కార్వేటినగరం మేజర్ పంచాయతీ 90 బూత్ కన్వీనర్ వాసు దేవ రెడ్డి క్లస్టర్ కోఆర్డినేటర్ చిరంజీవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ హామీల అమలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.