GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 9:22 pm Digital Edition : GURU SWAMY

కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం

-ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు ఆగస్టు 9 (గరుడ దాత్రి న్యూస్)

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలోని కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమఫలాలుఅర్హులందరికీ అందుతున్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు.”రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన – ఇంటింటి ప్రచారం” కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి చిత్తూరు నగరపాలక పరిధిలో 12వ వార్డు 190 రామాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, అమలు చేసిన సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ హామీల అమలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు రవి, గోపి, శేటు, వెంకటేష్ యాదవ్, ఈశ్వరరావు, తెదేపా కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.