* పారిశ్రామిక వాడగా గుడిపల్లి మండలం.
* రామకుప్పం వద్ద త్వరలో విమానాశ్రయం.
* కుప్పం చరిత్రలో చిరస్థాయిగా చంద్రబాబు పేరు ప్రఖ్యాతలు.
* గుడిపల్లి మండల టిడిపి నేతలు ఆర్.చంద్రశేఖర్, బాబు నాయుడు, సుబ్రమణి.
* గుడిపల్లి మండలంలో కొనసాగుతున్న పంచాయతీ టీడీపీ సర్వసభ్య సమావేశాలు.
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 07 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): శ్రీశైలం నుండి కుప్పం నియోజక వర్గానికి కృష్ణా జలాలను తీసుకువచ్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుడుపల్లి మండలంలో పంచాయితీ తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశాలను నిర్వహిస్తున్నారు. గుడిపల్లి మండలం సంగనపల్లిలో బుధవారం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్.చంద్రశేఖర్, టీ. ఎం. బాబు నాయుడు, సుబ్రమణి లు ప్రసంగించారు. శ్రీశైలం నుండి 750 కిలోమీటర్ల దూరంలో 1200 అడుగుల ఎత్తులో ఉన్న కుప్పంకు కృష్ణా జలాలను తీసుకువచ్చాడరన్నారు. ఇది కేవలం అపర భగీరధుడు చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. ఏ నాయకుని వల్ల కూడా ఇది సాధ్యపడతన్నారు. గుడిపల్లి మండలాన్ని పారిశ్రామిక మండలం గా తీర్చి దిద్దుతున్నారన్నారు. తిరుపతి వద్ద శ్రీ సిటీ వలె గుడుపల్లె మండలం లోని పొగరుపల్లెను అభివృద్ధి చేస్తున్నారన్నారు. రామకుప్పం వద్ద త్వరలోనే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమన్నారు. కుప్పం నియోజకవర్గానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హేమాంబర గౌడు, బేటప్ప నాయుడు, సురేష్ స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.