GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 7:06 pm Posted by : GARUDA DHATRI NEWS

కేవీబిపురం పోలీస్ స్టేషన్‌కు కానిస్టేబుల్ తంబు రాజు బదిలీ

గరుడధాత్రి :
నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తంబు రాజును సాధారణ బదిలీపై కేవీపీపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో ఐదు సంవత్సరాల సేవ పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ బదిలీ జరిగినట్లు వెల్లడించారు.
ఈ మేరకు శుక్రవారం నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ తంబు రాజుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ, నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా తంబు రాజు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ మంచి సేవలు అందించారని ప్రశంసించారు.
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ స్థానికంగా మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. పోలీస్ శాఖకు ప్రజల మధ్య మరింత విశ్వాసం పెంచేలా ఆయన సేవలు ఉన్నాయని కొనియాడారు. కేవీపీపురం పోలీస్ స్టేషన్‌లో కూడా ఇదే విధంగా సేవలందిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సహచర పోలీసు సిబ్బంది తంబు రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు.