కే యం పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ చేసిన ఉప విద్యాశాఖ అధికారి
కార్వేటి నగరం సెప్టెంబర్ 28 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం కేఎం పురం పంచాయతీలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి మహేశ్వరరావు సోమవారం తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో జరుగుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి 10వ తరగతి విద్యార్థులకు సూచనలు సలహాలు అందించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. పాఠశాలలో గత సంవత్సరంలో 580 మార్కులు సాధించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సునీత మండల విద్యాశాఖ అధికారి...