కే.వి.బి.పురం మండలం రాయపాడు గ్రామంలో ఘనంగా టీడీపీ జెండా దిమ్మె ఆవిష్కరణ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గొల్ల నరసింహ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించడంతో గ్రామంలోని పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.