కైగల్ వద్ద బోల్తాపడ్డ పాల వ్యాన్, అశోక్ లైలాండ్ వాహనం. ఒకరికి గాయాలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు21 బైరెడ్డిపల్లి–కుప్పం జాతీయ రహదారిలోని కైగల్ వాటర్ ఫాల్స్ మలుపు వద్ద శుక్రవారం రెండు వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొని బోల్తాపడ్డాయి. దేవదొడ్డి నుంచి పాలు సేకరించుకుని వీకోట వైపు వెళ్తున్న మహేంద్ర పాల వ్యాన్ వికోట వైపు నుండి మామిడికాయల లోడుతో వెళ్తున్న అశోక్ లైలాండ్ వాహనం కైగల్ వాటర్ ఫాల్స్ సమీపంలోని మలుపు వద్ద ఢీకొన్నాయి. దీంతో రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడ్డాయి. అశోక్ లేలాండ్‌లో ఉన్న మామిడికాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పాల వ్యాన్‌లోని పాలు నేలపాలైనట్లు...