కొల్లన్ మృతికి రాజేష్ ఘన నివాళి

-కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నాగలాపురం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ సభ్యుడు దేశప్పన్ తండ్రి కొల్లన్ బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పరమపదించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ గురువారం నాగలాపురం వెస్ట్ హరిజనవాడకు చేరుకుని కొల్లన్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దేశప్పన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేష్, వారి దుఃఖాన్ని పంచుకుని...