కార్వేటినగరం ఆగస్టు 9 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరం మండలం కొల్లాగుంట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రావ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. రానున్న స్థానిక సమస్య ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఆదివారం క్లస్టర్ (6) లోని 104,128,132 ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ లు మరియు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రాజేంద్రరెడ్డి,(104) డి ఎం పురం గ్రామపంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట ముని, (128) కొల్లాగుంట బూత్ కన్వీనర్ డానియల్, ఐ టి టి డి పి మండల ప్రెసిడెంట్ సుమన్,(132) ఎల్ ఆర్ పేట బూత్ కన్వీనర్ కిషోర్ పాల్గొన్నారు. బూత్ కన్వీనర్లకు మై టిడిపి ఆప్ గురించి అవగాహన కల్పించారు. కరపత్రాలను అందజేసి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు గురించి ప్రజలలో అవగాహన కల్పించు కార్యక్రమాన్ని బూత్ కన్వీనర్లకు వివరించి ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం జరిగినది,