కోట ఆగస్టు 2 (గరుడ ధాత్రి న్యూస్)
భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు, కోట మండల బిజెపి అధ్యక్షుడిగా గునుపూడి హరిబాబు అధికారికంగా నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.
కోట మండల బిజెపి అధ్యక్షులు గునుపూడి హరిబాబు మాట్లాడుతూ
తనపై నమ్మకంతో కోట మండల బాధ్యతలను అప్పగించిన జిల్లా అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డికి ఇతర రాష్ట్ర, జిల్లా పార్టీ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నాయకులు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరితోనూ కలిసికట్టుగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రజాక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ ప్రచారం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని హరిబాబు పేర్కొన్నారు.