కోర్టులో కేసులు ఉన్నా..జోరుగా భూ కబ్జా -రెవెన్యూ అధికారుల కళ్ళకు గంతలు..!!
గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలోని కోటమిట్ట ప్రాంతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సోమవారం కొందరు దర్జాగా కబ్జా చేసుకోవడం జరిగింది ఒకపక్క తాసిల్దార్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అర్జీలు తీసుకుంటున్న సందర్భంలోనే ఈ కబ్జాకు కొందరు తెర తీశారు బాధితులు లబోదిబోమని సంబంధిత విఆర్ఓ కు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయింది మాకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయి... అధికారులు ఏం చేస్తారు.... పేదలు ఏం చేస్తారు.. మాదే ఆక్రమణ... మాదే భూమి...