GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:50 am Digital Edition : GURU SWAMY

గంగమాంబాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ చేసిన సి ఆర్ సి హెచ్ ఎం

కార్వేటినగరం సెప్టెంబర్ 28 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మండలం ముక్కరవానిపల్లి పంచాయతీలో ఉన్న గంగమాంబాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కత్తిరి పల్లి సి ఆర్ సి హెచ్ ఎం చంగల్ రాజు సోమవారం తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సూచనలు సలహాలు అందించారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన వారిని అభినందించారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లలిత పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.