GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 9:20 pm Digital Edition : GURU SWAMY

గంగమ్మను దర్శించుకున్న ప్రముఖులు

గంగమ్మను దర్శించుకున్న ప్రముఖులు..

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ను పురస్కరించుకొని బుధవారం పలువురు ప్రముఖులు గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, గౌరు వెంకటరెడ్డి దంపతులు ఆలయం వద్దకు చేరుకోగానే ఆలయ చైర్మన్ మైనారు మహేష్ యాదవ్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వారికి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. వారితో పాటు టిటిడి పాలకమండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆయనకు చైర్మన్ మహేష్ యాదవ్ శాలువతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.
బైరాగి వేషంతో అమ్మవారికి మ్రొక్కులు…
గంగ జాతరలో భాగంగా బుధవారం భక్తులు భైరాగి వేషంలో చిన్న పెద్ద అనే తారతమ్యత లేకుండా అందరూ ఆలయంలో ప్రదర్శనలు చేసి మ్రొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేశారు.