గరుడధాత్రి న్యూస్ :
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు పడి రైతులు కు పంటలు బాగా పండి సంతోషంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి పులిగోరు మురళీకృష్ణారెడ్డి, ఆయన తనయురాలు పులిగోరు వీణారెడ్డి కుటుంబ సభ్యులు చందన వేషాలు ధరించి వేయికళ్ల దుత్తలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మ్రొక్కులు చెల్లించారు. అనంతరం పులిగోరు మురళీకృష్ణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రమంతా సకాలంలో వర్షాలు పడి చెరువుల కుంటలు నిండి వ్యవసాయం చేసుకునే రైతులకు సకాలంలో నీళ్లు సమృద్ధిగా లభించి సంతోషంగా జీవించాలన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. నేటి తరం పిల్లలు పెద్దలు ఉన్నత చదువులు చదువుకున్న క్రమం తప్పకుండా తాతయ్యగుంట గంగమ్మ తల్లి వేషాలు వేసి మొక్కులు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్య నిర్వాహక కార్యదర్శి రామదాసు ముని రామయ్య, గంగమ్మ గుడి మాజీ పాలకమండలి సభ్యులు గంజి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత నేత శరత్ చౌదరి, పులిగోరు అనుచరులు పాల్గొన్నారు.