GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 4:34 pm Posted by : GURU SWAMY

గంగాధర్ నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేపట్టిన వైసీపీ నాయకులు

గంగాధర్ నెల్లూరు మండలం గొల్లపల్లి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులకు మద్దతు ధర కల్పించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో నిరసన
సీఎం జిల్లాలో 60 వేల మంది మామిడి రైతులు రెండున్నర లక్షల ఎకరాలు మామిడి సాగు ఉన్నది..
మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదు
గిట్టుబాటు ధరకు ప్రభుత్వ సహకారం ఏమాత్రం లేదు..
జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం సిండికేట్ ద్వారా మూడు రూపాయల కూడా మేము ఇవ్వలేం అని చేతులెత్తేస్తే వారికి వత్తాస్తు పలుకుతున్న ముఖ్యమంత్రి
7 లక్షల టన్నులు మామిడి సాగు అయితే దాదాపు రెండు లక్షల సన్నులు మామిడి చెట్ల కిందే రాలిపోయింది.
వారం రోజులుగా కిలోమీటర్ల కొద్దీ క్యు కడుతున్న మామిడి ట్రాక్టర్ వారం రోజులుగా మామిడికాయలు మామిడి ట్రాక్టర్లు ఉంటే అది ఫ్యాక్టరీ యాజమాన్యం కాయలు ఎండిపోయింది అని పక్కకు నెట్టేస్తున్నారు.
రైతుల ప్రభుత్వం అని చిత్తూరు పర్యటనలో ముఖ్యమంత్రి ప్రసంగాలు చేస్తే ఇది ఆయన కనబడలేదా అని ఆరోపించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి. కర్ణాకర్ రెడ్డి వెంట ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు బండి హేమ సుందర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.