గంగినేయనిపల్లి లో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం వేడుకలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్19 బైరెడ్డిపల్లి మండలం లోని గంగినాయనిపల్లె ప్రాథమిక లో శుక్రవారం ఐదేళ్లు నిండిన చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాసం నిర్వహించి పాఠశాలలో చేర్చుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యువకుమార్, ఉపాధ్యాయులు రాజేష్ మరియు అంగన్వాడి టీచర్ సుగుణ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సరస్వతి దేవి పూజ చేసి పిల్లల చేత మొదటి అక్షరాలను దిద్దించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న నాణ్యమైన విద్యను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.