గంగ మిట్ట వద్ద కొలువుతీరిన గంగమ్మ తల్లి..!

తప్పెట్ల మోతలు.. మంగళ వాయిద్యాలు.. కేరళ మేళాలు.. భారీ బాణసంచా పేలుళ్లు.. మధ్య సత్యవేడు సదవాలమ్మ గ్రామోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు కొనసాగింది భక్తులు కాయ కర్పూర హారతులతో, జంతుబలులిచ్చి మరికొందరు మొక్కుబడులు తీర్చుకున్నారు ఆహ్లాదకర వాతావరణంలో ప్రతి ఒక్కరూ అమ్మవారికి చేతులెత్తి ముఖ్య ప్రార్థించడం... సత్యవేడు పట్టణం సుభిక్షంగా... కరువు కాటకాలకు దూరంగా.. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు ఉండాలని పలువురు ప్రార్థించారు అమ్మవారి ఊరేగింపు ఒకపక్క... ఆమె వెనుకే పిండి దీపాల ప్రమిదలతో మహిళలు...