గంజాయి నిర్మూలనకు కొత్త టెస్టింగ్ కిట్ – సత్యవేడు పరిసరాల్లో పూర్తిగా అరికడతాం : సిఐ మురళి నాయుడు
సత్యవేడు ప్రాంతంలో గంజాయి వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సత్యవేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మురళి నాయుడుతెలిపారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయి నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త టెస్టింగ్ కిట్‌ను ప్రవేశపెట్టిందని, ఈ కిట్ ద్వారా గత రెండు నెలల క్రితం గంజాయి సేవించినా గుర్తించవచ్చని తెలిపారు. ఈ కిట్ వినియోగంతో గంజాయి వినియోగాన్ని గుర్తించి అరికట్టడం సులభమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సత్యవేడు మరియు చుట్టుపక్కల గ్రామాల్లో...