తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
*గంజాయి రహిత తిరుపతి జిల్లా సాధనే ప్రధాన లక్ష్యం.*
*అందులో భాగంగా మరో కీలక అడుగు వేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు ఐపీఎస్., గారు.*
*జిల్లాలో గంజాయి నిర్మూలనకు 4 అంచెల విధానాన్ని అవలంభిస్తున్న జిల్లా పోలీసు శాఖ.*
*1. జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలు, కళాశాలతో పాటు colonies మరియు గ్రామాలలో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహణ.*
*2. గంజాయి రవాణా మరియు వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు.*
*3. పదే పదే గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 16 మంది గుర్తించి వారిపై PIT NDPS (PD ACT) కేసులు నమోదు చేయగా, వారిలో 12 మందికి ఆమోదం లభించడంతో వారిని జైలుకు పంపడమైనది, మిగతా నలుగురు పరిశీలనలో ఉన్నారు.*
*ఈరోజు నూతన ఒరవడితో గంజాయి సేవించే వారిని నిర్ధారించడానికి ప్రత్యేకంగా తయారు చేయబడిన మెడికల్ కిట్ ల ద్వారా టెస్టింగుకి శ్రీకారం.*
*గంజాయి టెస్ట్ కిట్ లను జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్ లకు అందజేత.*
*టెస్టులలో పాజిటివ్ గా వచ్చిన వారి ద్వారా గంజాయి లభ్యతకి సంబంధించిన సమాచారం సేకరించడంతో పాటు …గంజాయి సేవించే వారిలో పరివర్తన తీసుకుని రావడానికి ప్రత్యేక మైన చర్యలు.*
*పదే పదే గంజాయి టెస్టు లలో పాజిటివ్ గా వచ్చే వారి వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు.*
*యువత సత్ప్రవర్తన తో మెలగాలి, విలువైన్ జీవితాలను నాశనం చేసుకోవద్దు.*
*పోలీస్ వారికి సహకరించండి, గంజాయి రహిత జిల్లా ఏర్పాటు లో భాగస్వామ్యం కండి.*
*గంజాయి పై 1972 మరియు 112 కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి, మీ వివరాలు గోప్యం గా ఉంచబడుతుంది.*
*తిరుపతి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్.,గారు పిలుపు.*
తిరుపతి జిల్లాలో గంజాయి రహిత సమాజం నిర్మాణం కోసం పోలీస్ శాఖ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రధాన కారణమని, వాటి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా నాలుగు అంచెల విధానంతో గంజాయి నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, విద్యాసంస్థలు, colonies మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం పెంచుతున్నామని చెప్పారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈరోజు నుండి తిరుపతి జిల్లా లో నూతన సాంకేతికతతో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక మెడికల్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టామని, వీటి ద్వారా పాజిటివ్‌గా వచ్చిన వారి నుంచి సరఫరా మార్గాలపై కీలక సమాచారం సేకరిస్తామని తెలిపారు. అలాగే, గంజాయి వినియోగదారుల్లో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్ మరియు పునరావాస చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పారు.
గంజాయి సేవించే అనుమానాస్పద వ్యక్తులు, విద్యా సంస్థలలో గంజాయి వినియోగం గురించి తగిన సమాచారం ఆధారంగా గంజాయి టెస్టులు చేసే విధానమును ప్రవేశ పెట్టనున్నట్లు కూడా తెలియజేశారు.
పదే పదే టెస్టుల్లో పాజిటివ్‌గా వస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి గంజాయి రహిత తిరుపతి జిల్లాను సాధించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గంజాయి సంబంధిత సమాచారం ఉంటే వెంటనే 1972 మరియు 112 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీ వెంకట్రావు (పరిపాలన) గారు, శ్రీ రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు) గారు, శ్రీ ఐ రామకృష్ణ (తిరుమల) గారు, శ్రీ శ్రీనివాస్ (క్రైమ్స్) గారు, ఎస్బి డిఎస్ పి. శ్రీమతి గీతా కుమారి గారు, పాల్గొన్నారు