గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
-రెండు కిలోల గంజాయి, రెండు కత్తులు స్వాధీనం సత్యవేడు, జూన్ 16: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్న సత్యవేడు పోలీసులు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ సూచనలతో, సీఐ మురళీనాయుడు పర్యవేక్షణలో గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు గ్రామాల్లో అవగాహన...