గంటావూరు కాలనీ అభివృద్ధికి బాధ్యత నాది-అన్ని సౌకర్యాలు కల్పిస్తాం :ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి
పలమనేరు, జూన్ 14 గరుడ ధాత్రి : పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత తనదేనని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం సహా ప్రజలకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రాంతంలో ఉన్న ఈద్గా ప్రాంగణానికి ప్రహరీ నిర్మాణం మంజూరు చేయాలని కోరుతూ గంటావూరు కాలనీకి చెందిన మైనారిటీ సోదరులు టీడీపీ...