కాణిపాకం సెప్టెంబర్ 20 గరుడ దాత్రి న్యూస్ :
కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఏడవ రోజు ఆదివారం గజవాహనంపై స్వామివారు దర్శనమిచ్చాడు. ఉదయం అభిషేకము నిర్వహించి రాత్రి గజవాహనంపై పురవీధుల్లో స్వామి వారు ఊరేగాడు ఉభయ దారులుగా కాణిపాకం వన్నియ నాయకర్ వంశస్థులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్. కాణిపాకం మాజీ సర్పంచులు మధుసూదన్ రావు. శాంతి సాగర్ రెడ్డి వేద పండితులు. అర్చకులు. ఉభయ దారులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు