గజవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి దివ్య విహారం
-కర్మ విముక్తిని ప్రసాదించే గజవాహన సేవ -మంగళవాయిద్యాలు, కోలాటాలతో మారుమోగిన మాడవీధులు -భక్తులకు అభయప్రదానం చేసిన గోవిందుడు తిరుపతి,మే 28 గరుడధాత్రి : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు గురువారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుకు సాగుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి గోవింద నామస్మరణతో స్వామివారిని సేవించుకున్నారు. గజవాహనం ఐశ్వర్యానికి, మంగళానికి ప్రతీకగా...