గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారి దివ్య విహారం

తిరుమల, సెప్టెంబరు 20 గరుడధాత్రి న్యూస్ : భక్తులకు కరుణామృత కటాక్షం.. ప్రబంధ పారాయణం.. మంగళవాయిద్యాలు.. గోవిందనామస్మరణతో మార్మోగిన తిరుమాడ వీధులు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల గోవిందనామస్మరణతో తిరుమాడ వీధులు భక్తిపారవశ్యంతో మార్మోగాయి. భక్తబృందాలు భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఆధ్యాత్మిక సందడి నెలకొల్పాయి. జీయ్యంగార్ల ప్రబంధ పారాయణంతో వాహనసేవ...