గడ్డంవారిపల్లిలో ‘మేరా రేషమ్ – మేరా అభియాన్’ సదస్సు
చౌడేపల్లి ఆగస్టు 07 గరుడ దాత్రి న్యూస్ చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లి గ్రామంలో "మేరా రేషమ్ – మేరా అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి డిఎస్‌ఓ రాధా మేడమ్, సీఎస్‌బీ సైంటిస్ట్ అలేఖ్య మేడమ్, ఏఎస్ఓ అరుణ మేడమ్ మరియు టీఏ వనజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్‌ఓ రాధా మేడమ్ రైతుల మల్బరీ తోటలను, పట్టుపురుగుల పెంపకం షెడ్లను క్షేత్రస్థాయిలో సందర్శించారు. పట్టు పరిశ్రమ అభివృద్ధికై ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు, సబ్సిడీల వివరాలను...