గరుడసేవకు పటిష్ట భద్రతా వ్యూహం.. తిరుమలలో పోలీసుల క్షేత్రస్థాయి పరిశీలన
తిరుమల, ఆగస్టు 8 గరుడధాత్రి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు–2026కు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా గరుడసేవ రోజున భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షితంగా బయటకు తరలించేలా ప్రత్యేక నిష్క్రమణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా తిరుమల డీఎస్పీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ...