గరుడసేవ, రథోత్సవాలకు ఘన ఏర్పాట్లు – జెఈవో వీరబ్రహ్మం

గరుడధాత్రి : నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, సమష్టి కృషితో అత్యంత వైభవంగా నిర్వహించాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, మే 28న జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. జూన్ 1న గరుడవాహన సేవ, జూన్ 4న రథోత్సవం మరియు కళ్యాణోత్సవం,...