GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:40 am Digital Edition : GURU SWAMY

గరుడ సేవ కోసం తిరుమల చేరిన గొడుగులు

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి.
ఈ గొడుగులను సదరు సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. వరుసగా 22వ సారి శ్రీవారికి గొడుగులను సమర్పించడం విశేషం.